ముత్యాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

ముత్యాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Jul 6 2026 12:10 AM | Updated on Jul 6 2026 12:10 AM

చిల్లకూరు: మండల తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించారు. ఉదయం అమ్మవారికి పలు రకాల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులతో ఆలయంలోని క్యూలు పూర్తిగా నిండిపోయాయి. అలాగే పోలేరమ్మ గుడి వద్ద కూడా భక్తులు నైవేద్యాలను సమర్పించి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ఈఓ నవీన్‌కుమార్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ దశరథరామిరెడ్డి పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement