14న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

14న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ర్యాలీ

Jul 6 2026 12:10 AM | Updated on Jul 6 2026 12:10 AM

నెల్లూరు(టౌన్‌): దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 14వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీస్థాయిలో ర్యాలీ నిర్వహించి నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద పికెటింగ్‌ను నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా చైర్మన్‌ కంచర్ల మధుసూదన్‌రావు, రాష్ట్ర పరిశీలకుడు ఎన్వీ రమణయ్య తెలిపారు. ఆదివారం నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్‌ వద్ద ఉన్న యూటీఎఫ్‌ కార్యాలయంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పలు ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోరాటానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ వెంటనే నియమించాలన్నారు. 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేస్తున్న టెట్‌ను రద్దు చేయాలనే డిమాండ్లతో ప్రభుత్వంపై పోరుబాట పట్టామన్నారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ జావీద్‌ మాట్లాడుతూ కలెక్టరేట్‌ వద్ద భారీ స్థాయిలో జరిగే పికెటింగ్‌ను జయప్రదం చేయాలని కోరుతూ తాలూకా కేంద్రాలలో సన్నాహక సభలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. అలాగే 14న కలెక్టరేట్‌ వద్దకు ఉపాధ్యాయ లోకం తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కో చైర్మన్‌ ప్రసాద్‌, నాయకులు వీవీ శేషులు, నరసింహం, గురవయ్య, చలపతిశర్మ, దశరథరాములు, కృష్ణ, తమీమ్‌ అన్సారీ, బాలరాగయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement