రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 31.26 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు.కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
వడదెబ్బకు
రైతు కూలీ మృతి
వాకాడు: మండల కేంద్రమైన వాకాడు బంగ్లా సెంటర్ గిరిజన కాలనీకి చెందిన సాతాను గోపాలయ్య (60) అనే రైతు కూలీ ఆదివారం సవళ్ల పొలాల వద్ద వడదెబ్బకు గురై మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గోపాలయ్య వ్యవసాయ కూలీ పనులతోపాటు సవళ్ల పొలాల్లో పలువురికి కాపలా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తాను కాపలా ఉంటున్న పొలం వద్ద కూలీ పనులు చేశాడు. మధ్యాహ్నం పచ్చిగడ్డి కోసుకుని ఇంటికి తిరిగొచ్చే ప్రయత్నంలో కుప్పకూలాడు. సాయంత్రం అటువైపుగా వెళ్లిన సహచర కాపలాదారులు గుర్తించి గోపాలయ్య కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అప్పటికే అతను చనిపోయాడు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.50
సన్నవి : రూ.20
పండ్లు : రూ.10


