● ఆందోళనలో అన్నదాతలు
సైదాపురం: కండలేరు జలాశయంలో నీరున్నా మండల కేంద్రమైన సైదాపురం చెరువు ఆయకట్టు రైతుల ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది చెరువులో చుక్కనీరు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. గడిచిన ఐదేళ్లపాటు నీరు విడుదల చేయగా ఈసారి ఆ పరిస్థితి లేదు. దీంతో రెండు వందల ఎకరాల నిమ్మతోటలు ఎండుముఖం పట్టాయి. అలాగే అంతర్ పంటలకు కూడా నీరు అందకపోవడంతో రైతులు సాగు చేసుకోలేని దుస్థితి వచ్చింది. సైదాపురం చెరువుకు జోగిపల్లి కాలువ ద్వారా ఏటా గంగ నీరు విడుదల అవుతుండేది. ఈ సీజన్ మొదలైనా కండలేరు జలాశయం నుంచి చుక్కనీరు విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


