గౌరవ వేదన | - | Sakshi
Sakshi News home page

గౌరవ వేదన

Jul 6 2026 12:10 AM | Updated on Jul 6 2026 12:10 AM

ఎంపీటీసీలకు రెండేళ్లుగా

అందని వేతనం

సర్వసభ్య సమావేశాలకే పరిమితం

సెప్టెంబర్‌లో

ముగియనున్న పదవీ కాలం

దుత్తలూరు: కూటమి ప్రభుత్వంలో పాలన గాడి తప్పుతోంది. ఎన్నికల హామీలను గాలికొదిలిన సర్కార్‌.. పాలన వ్యవహారాల్లో సైతం ఇస్టానుసారంగా వ్యవహరిస్తోంది. పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడంలేదనే విమర్శలూ లేకపోలేదు. టీడీపీ సర్కార్‌ ఏర్పడి రెండేళ్లు దాటినా, ఎంపీటీసీలకు గౌరవ వేతనాన్ని మంజూరు చేయలేదు.

గతంలో చెల్లింపు

జిల్లాలోని 37 మండలాల్లో 541 ఎంపీటీసీలున్నా రు. వాస్తవానికి వీరికి ప్రతి నెలా గౌరవ వేతనంగా రూ.మూడు వేలను ఇవ్వాల్సి ఉంది. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో వీరికి రెండు విడతలుగా ఈ మొత్తాన్ని అందజేశారు. ఆపై ఎన్నికలు రావడం.. అందులో టీడీపీ గెలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఈ ఊసే లేదు. బడ్జెట్లను పలుమార్లు ప్రవేశపెట్టినా, ప్రజా ప్రతినిధుల ఖాతాల్లో నిధులు జమకాలేదు. సర్వ సభ్య సమావేశాలకు హాజరుకావడం మినహా ప్రజ ల సమస్యలను పరిష్కరించే పరిస్థితే లేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ప్రయోజనం ఉండటంలేదనే భావన వీరిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం.. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై పలుచోట్ల సమాచారాన్నీ ఇవ్వకపోవడంపై వీరిలో ఆవేదన వ్యక్తమవుతోంది.

జిల్లాలో ఇలా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement