కాలయాపన | - | Sakshi
Sakshi News home page

కాలయాపన

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నామని చెప్తూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 250కుపైగా సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉంది. గతేడాది నిర్వహించిన బదిలీల అనంతరం జిల్లాలో 406 మంది మిగులు స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారనే లెక్కలను జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చారు. గత విద్యా సంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు జిల్లాలో దాదాపు 250 మందికిపైగా ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. దీంతో ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement