అక్రమ మద్యం, గంజాయిని కట్టడి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం, గంజాయిని కట్టడి చేయాలి

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

ఎకై ్సజ్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ

నెల్లూరు(క్రైమ్‌): అక్రమ మద్యం, గంజాయిని కట్టడి చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ అధికారులను ఆదేశించారు. నెల్లూరు ఎకై ్సజ్‌ డీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎకై ్సజ్‌ స్టేషన్ల వారీగా నమోదైన కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ పొరుగు మద్యం జిల్లాలోకి రాకుండా సరిహద్దులో పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలు, బెల్ట్‌ దుకాణాలు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను కట్టడి చేయాలన్నారు. మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు మరో మూడునెలల్లో ముగియనున్నందున ఫీజుల వసూళ్లను వేగవంతం చేయడంతోపాటు దుకాణాల్లో అనధికార మద్యం నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తును త్వరితతిన పూర్తిచేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న నిందితులను అరెస్ట్‌ చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలన్నారు. ఎన్‌డీపీఎస్‌, గంజాయి కేసుల్లోని నిందితులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేయాలని సూచించారు. సమావేశంలో డీసీఎం శంకరయ్య, ఏసీ పి.దయాసాగర్‌, ఎకై ్స జ్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement