అల్లకల్లోలంగా సముద్రం | - | Sakshi
Sakshi News home page

అల్లకల్లోలంగా సముద్రం

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

వేట నిలిపి ఒడ్డుకు చేరిన మత్స్యకారులు

వాకాడు: సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. మండలంలోని తూపిలిపాళెం వద్ద సముద్రంపై వేట సమయంలో వాతావరణ పరిస్థితులు భయాందోళన కలిగించేలా గురువారం కనిపించాయి. కడలిలో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గంటలు నిశ్శబ్దంగా ఉన్న సముద్రం, ఒక్కసారిగా ఉగ్రరూపంతో మారి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం నుంచి దాదాపు ఐదు నాటికల్‌ మైళ్ల దూరంలో ఒక్కసారిగా సుడులు తిరుగుతూ భయాందోళన కలిగిస్తుండటంతో వేట చేసే బోట్లు ఒక్కచోట నిలవక తిరగబడుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. దీంతో వేటను నిలిపేసి ఒడ్డుకు వీరు పరుగులు తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement