ఆదాయంతో పాటు ఆరోగ్యం ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఆదాయంతో పాటు ఆరోగ్యం ముఖ్యం

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆదాయంతో పాటు ఆరోగ్యం సక్రమంగా ఉండేలా చూడాలని సెర్ఫ్‌ సీఈఓ వాకాటి కరుణ పేర్కొన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో అందరూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో కిచెన్‌ గార్డెన్లను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అవసరాన్ని బట్టి సీ్త్ర నిధి రుణాలను మంజూరు చేయాలని పేర్కొన్నారు. సీసీలందరికీ మొబైల్‌ ఫోన్లను రెండు నెలల్లో అందజేయనున్నామని వెల్లడించారు. జిల్లాలో టీమ్‌ వర్క్‌ అద్భుతంగా ఉందని, ఇదే విధంగా ముందుకుసాగాలని సూచించారు. సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఏసీఎల్పీ కార్యక్రమం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఫుడ్‌ బాస్కెట్‌ను అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి రెండెకరాలను తీసుకొని అందులో వివిధ రకాల పంటలను సాగు చేసిన చేజర్ల ఏపీఎం సృజనను అభినందించారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఏపీడీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement