● పట్టించుకోని పోలీసులు
కొండాపురం: గొట్టిగొండాల గ్రామంలో కోటా అంకమ్మ తల్లి తిరునాళ్ల జరుగుతున్నాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో జోరుగా డైమండ్ డబ్బా, మూడు ముక్కలాట జరిగాయి. సుమారు 20, 30 మంది వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాటిని నిర్వహించారు. తిరునాళ్ల పెద్ద స్థాయిలో జరుగుతుంది. కొండాపురం, కలిగిరి, వింజమూరు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కొండాపురం ఎస్సై కాసుల శ్రీనివాసులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. అయినా జూదం జరుగుతుంటే కనీసం పట్టించుకోలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ కమిటీ సభ్యు లు జూద నిర్వాహకుల నుంచి రూ.300 రుసు ము వసూలు చేసి రశీదు ఇస్తున్నారు. ఈ తంతు మొత్తం పోలీసులకు తెలిసే జరిగిందని భక్తులు అంటున్నారు. టీడీపీ నాయకులు ప్రమేయం ఉందని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై కొండాపురం ఎస్సైని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.


