పాఠశాలలను పునఃప్రారంభించి మూడు వారాలు
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. సర్కారీ పాఠశాలల్లో అమలు చేసిన సంస్కరణలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. నాడు – నేడు.. అమ్మఒడి.. విద్యార్థులకు కిట్ల పంపిణీ.. ఇలా ప్రతి అంశంలోనూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ.. స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టేలా పరోక్ష సహకారాన్ని అందిస్తోంది. వారు వ్యవహరిస్తున్న ప్రతి అంశం ఈ వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తోంది. వాస్తవానికి గతంలో స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేసి వారి ముఖంలో చిరునవ్వును నింపేవారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా, వీటిని ఇవ్వకుండా కర్కశ ధోరణిని కూటమి సర్కార్ అవలంబిస్తోంది. పర్యావసానంగా పిల్లలను బడిలో చేర్పించేందుకు గానూ అప్పుల కోసం పేరెంట్స్ పడుతున్న తిప్పలు వర్ణనాతీతంగా మారుతున్నాయి.
గత వైఎస్సార్సీపీ
హయాంలో..
మొదటి రోజే
జగనన్న విద్యాకానుక కిట్లు


