చెన్నూరు గ్రామ వ్యూ
●
రాష్ట్ర విభజనానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచి సీఎం హోదాలో చెన్నూరుకు చంద్రబాబు విచ్చేశారు. ఆ ఎలక్షన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలుపొందిన ప్రజాప్రతినిధి ఆయన మాయలో పడి అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీ పంచన చేరారు. పార్టీ అధినేతను గూడూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి తన ఇమేజ్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో జన్మభూమి మూడో విడత కార్యక్రమాన్ని అస్త్రంలా వాడేందుకు పన్నాగం పన్నారు. ఇందులో భాగంగా చెన్నూరును ఎంపిక చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన చంద్రబాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్‌గా మారుస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో తమ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశించారు. అయితే ఇది జరిగి తొమ్మిదేళ్లయినా, ఇందులో ఏదైనా జరిగిందానంటే శూన్యమనే చెప్పొచ్చు. ఈ పరిణామాలతో గ్రామస్తులు ఉసూరుమంటున్నారు.
పంచాయతీ: చెన్నూరు
(మున్సిపాల్టీలో నేడు విలీనం)
హామీలిచ్చిన తేదీ – జనవరి పది, 2017
జనాభా – 15 వేలు
చేనేతలు: ఐదు వేలు
ఎస్సీ, ఎస్టీలు – దాదాపు ఏడు వేలు
ఇతరులు – సుమారు మూడు వేలు
చిల్లకూరు: హామీలివ్వడం.. ఆపై వీటిని విస్మరించడం సీఎం చంద్రబాబుకే చెల్లుతుంది. 2014 – 19 మధ్య ఇదే తరహాలో వ్యవహరించి ఎంతో మందికి అంతులేని ఆవేదనను మిగిల్చారు. తాజాగా సూపర్ సిక్స్ పేరిటా ఎంతో మందిని వంచించారు. ఇదే కోవలో ఏకంగా గ్రామస్తులనే నమ్మించి దగా చేసిన ఉదంతానికి తొమ్మిదేళ్లు దాటుతోంది.
అతీగతీ లేని భూగర్భ డ్రైనేజీ
నీటి నిల్వ ఒట్టి మాట..
రెండో హామీ కింద భూగర్భ డ్రైనేజీ అని ప్రకటించారు. గ్రామంలోని సుమారు ఐదు వేల ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలతో పాటు వర్షం కురిసే సమయంలో వచ్చే నీరు రోడ్లపై పారకుండా దీన్ని ఏర్పాటు చేసి పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సర్కార్‌కు అందించకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
మొదటి హామీలో భాగంగా ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న చెన్నూరులో వెయ్యెకరాల విస్తీర్ణంలోని చెరువును తెలుగుగంగ నీటితో ఏడాది మొత్తం నిల్వ ఉండేలా చర్యలు చేపడతామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇది నేటికీ కార్యరూపం దాల్చలేదు.
నియోజకవర్గం: గూడూరు
2
1
చెన్నూరు సిల్క్‌తో ప్రపంచ గుర్తింపు
గూడూరుకు అతి సమీపంలో ఉండే చెన్నూరులోని చేనేతలు 80వ దశకం వరకు తయారు చేసిన సిల్క్‌కు మంచి గిరాకీ ఉండేది. ఆనాడు ఇక్కడి స్కిల్ చొక్కాను ధరిస్తే ఆ కుటుంబానికి ఒక హోదా ఉండేదని భావించేవారు. ఈ స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామాన్ని తన దత్తత గ్రామంగా జనవరి పది, 2017న చంద్రబాబు ప్రకటించారు.
గ్రామాన్ని దత్తత తీసుకుంటామని
ఆర్భాటంగా ప్రకటన
సూపర్ సిక్స్ తరహాలో నాడే ఆరు హామీలు
ఇందులో అమలైంది శూన్యం
విస్మరించిన ముఖ్యమంత్రి
ఇప్పుడైనా కరుణిస్తారానని స్థానికుల ఆశ


