వైఎస్‌ జగన్‌తో పర్వతరెడ్డి భేటీ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తో పర్వతరెడ్డి భేటీ

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలు, నియోజకవర్గ పరిణామాలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌

పారా లీగల్‌ వలంటీర్లకు అవగాహన సదస్సు

నెల్లూరు (లీగల్‌): ప్రజా ప్రయోజిత, న్యాయసేవలపై పారాలీగల్‌ వలంటీర్ల (న్యాయసేవా సహాయకులు)కు అవగాహన సదస్సును జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా భవన్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌అదాలత్‌ శాశ్వత న్యాయమూర్తి రామశ్రీనివాసరావు మాట్లాడారు. సామాన్య ప్రజలు.. న్యాయ వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేసే వారే పారా లీగల్‌ వలంటీర్లని చెప్పారు. న్యాయ సాయం కోసం వచ్చే బాధితులకు కౌన్సెలింగ్‌ చేస్తూ ఉచిత న్యాయసేవల సంస్థలను ఆశ్రయించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మశ్రీ, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ గోపాల్‌రెడ్డి, లోక్‌ అదాలత్‌ సభ్యులు కోటేశ్వరరావు, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

వందేభారత్‌ వేళల్లో స్వల్ప మార్పులు

నెల్లూరు సిటీ: చైన్నె సెంట్రల్‌ నుంచి నరసాపూర్‌ (20677) మధ్య నడిచే వందేభారత్‌ వేళల్లో స్వల్ప మార్పులను రైల్వే అధికారులు చేశారు. గతంలో నెల్లూరు రైల్వేస్టేషన్‌కు ఉదయం 8.29కు వచ్చి 8.30కు బయల్దేరేది. తాజాగా సవరించిన మేరకు బుధవారం నుంచి 8.41కు చేరుకొని 8.42కు బయల్దేరనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement