మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన కారు
● మహిళ మృతి
ఉదయగిరి: మండలంలోని దాసరిపల్లి వద్ద బుధవారం రాత్రి మోటార్‌బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెంంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దాసరిపల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సయ్యద్ మహబూబ్‌బాషా ఉదయగిరి ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబాన్ని స్వగ్రామం దాసరిపల్లి నుంచి ఉదయగిరికి మార్చాడు. మహబూబ్‌బాషా బుధవారం డ్యూటీకి వెళ్లాడు. భార్య సాహెరా (43) కుమారుడు మజహర్‌తో కలిసి బైక్‌పై పుట్టిల్లు దాసరిపల్లికి వచ్చింది. అక్కడ కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపింది. అందరూ కలిసి భోజనం చేశా రు. అనంతరం తల్లీకుమారుడు ఉదయగిరికి బయలుదేరారు. జాతీయ రహదారిపైకి వచ్చిన వెంటనే ఉదయగిరి వైపు నుంచి దుత్తలూరుకు వెళ్తున్న కారు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సాహెరా అక్కడికక్కడే మృతిచెందింది. మజహర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. కారు వింజమూరు మండలం గుండెమడగలకు చెందిన వారిదిగా చెబుతున్నారు.
మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన కారు


