పర్వతరెడ్డికి టాస్క్‌ఫోర్స్ కమిటీ బాధ్యతలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ కమిటీలను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల టాస్క్‌ఫోర్స్ బాధ్యతలను ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించారు. అక్కడ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి పనిచేయాలని సూచించారు.
భోగి వేడుకల్లో
వెంకయ్యనాయుడు
వెంకటాచలం(పొదలకూరు): మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో భోగి మంటలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం వేశారు. తన కుటుంబసభ్యులతో కలిసి పండగను జరుపుకొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించారు. సంక్రాంతిని సుఖసంతోషాలతో జరుపుకోవాలని కాంక్షించారు.
సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి
నెల్లూరు (వీఆర్సీసెంటర్): సంక్రాంతిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత బుధవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలను తెలియజేశారు.
కల్యాణ వైభోగమే..
రాపూరు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, గోదాదేవి కల్యాణాన్ని కనులపండువగా బుధవారం నిర్వహించారు. గోదాదేవి, పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులను తిరుచ్చిపై కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మాడవీధుల్లో క్షేత్రోత్సవం, కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
శ్రీవారి దర్శనానికి
ఆరు గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,014 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
పర్వతరెడ్డికి టాస్క్‌ఫోర్స్ కమిటీ బాధ్యతలు
పర్వతరెడ్డికి టాస్క్‌ఫోర్స్ కమిటీ బాధ్యతలు
పర్వతరెడ్డికి టాస్క్‌ఫోర్స్ కమిటీ బాధ్యతలు
పర్వతరెడ్డికి టాస్క్‌ఫోర్స్ కమిటీ బాధ్యతలు


