సంక్రాంతిని సంతోషంగాజరుపుకోవాలి
నెల్లూరు రూరల్: సంక్రాంతిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలను తెలియజేశారు.
భోగభాగ్యాలతో తులతూగాలి
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో పంటలు సమృద్ధిగా పండి.. ప్రజలు, రైతులు భోగభాగ్యాలతో తులతూగాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు.
ఓటీఎం కాంప్లెక్స్ ప్రారంభం
ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్లో ఆపరేషనల్ ట్రెయినింగ్ మాన్యువల్ (ఓటీఎం) కాంప్లెక్స్‌ను తూర్పు ప్రాంత కోస్ట్ గార్డ్ కమాండర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ధతింధర్‌సింగ్ సైనీ మంగళవారం ప్రారంభించారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజేష్ మిత్తల్, డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్ నంబర్ 6 కమాండర్ అజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెయింటేస్తూ.. పైనుంచి పడి
● యువకుడి మృతి
కావలి (అల్లూరు): పెయింటేస్తూ కిందపడటంతో యువకుడు మృతి చెందిన ఘటన కావలి పట్టణంలోని టీచర్స్ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని అరుంధతీయపాళేనికి చెందిన కోడూరు రమేష్ (35) పెయింటర్. ఈ క్రమంలో కావలి ఏఎమ్సీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి నివాసానికి పెయింటేస్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి.. ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు తరలిస్తుండగా మృతి చెందారు. సుకుమార్‌రెడ్డి ఇంటికి పెయింటింగ్ వేస్తుండగా, రోప్ తెగి బిల్డింగ్ పైనుంచి జారిపడి మృతి చెందారంటూ కుటుంబసభ్యులిచ్చిన సమాచారం మేరకు కేసును కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మృతుడికి భార్య, నాలుగు నెలల కుమార్తె ఉన్నారు.
సంక్రాంతిని సంతోషంగాజరుపుకోవాలి
సంక్రాంతిని సంతోషంగాజరుపుకోవాలి


