సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఏఎన్‌ఎంలకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించి సర్వేలు, మాతాశిశు సంరక్షణ సేవలు రోజూ చేయాల్సి ఉంటుందని వారు అన్నారు.
పీడీ యాక్ట్ ఎత్తేయాలంటూ..
అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి ర్యాలీ జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలే వెంగయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల గురునాథం మాట్లాడుతూ ఉద్యమకారులపై పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. నేతలు టీవీ ప్రసాద్, గోగుల శ్రీనివాసులు, ఎం.మోహన్‌రావు, గంగపట్నం రమణయ్య, జి.నాగేశ్వరరావు, ఎం.సుధాకర్ పాల్గొన్నారు.
ఎస్టీ కాలనీ సమీపంలో మృతదేహం
రాపూరు: మండలంలోని సైదాదుపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరాజేష్ తెలిపారు.
సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలి


