కండలేరు మట్టికట్టపై జంగిల్ క్లియరెన్స్
పొదలకూరు: కండలేరు మట్టికట్టపై అడవిని తలపిస్తున్న కంపకర్రను తెలుగుగంగ అధికారులు తొలగిస్తున్నారు. ముందుగా జీరో నుంచి 3వ కి.మీ వరకు జంగిల్ క్లియరెన్స్ చేపట్టనున్నారు. కంపకర్ర ఏపుగా పెరగడంతో కట్ట పటిష్టత దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందారు. గత నెల 19వ తేదీన ‘అడవి కాదు.. మట్టి కట్టే’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో జంగిల్ క్లియరెన్స్ పనులను అధికారులు వేగవంతం చేశారు. నాలుగు సబ్‌డివిజన్లుగా ఉన్న కట్టపై జంగిల్‌ను ఒక్కొక్క డివిజన్ పరిధిలో సుమారు రూ.20 లక్షల అంచనాలతో చేపడుతున్నట్టు తెలుస్తోంది.
కండలేరు మట్టికట్టపై జంగిల్ క్లియరెన్స్


