సంక్రాంతి వచ్చింది.. తమ కుటుంబీకులతో పండగను ఆనందంగా జరు
నెల్లూరు (టౌన్): సంక్రాంతి పేరుతో దోపిడీ పర్వానికి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు తెరలేపాయి. పండగకు సకుటుంబ.. సపరివార సమేతంగా సొంతూళ్లకు రావాలనుకున్న జిల్లా వాసులకు అధిక చార్జీలు అశనిపాతంలా పరిణమించాయి. చార్జీల భారంతో కొందరు ప్రయాణాలను మానుకుంటుంటే.. మరికొందరు అప్పులు చేయాల్సి వస్తోంది.
వామ్మో.. ఇంతా..?
హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చే ప్రైవేట్ బస్సుల్లో రెండు, మూడు రెట్ల మేర అధికంగా పెంచేశారు. ఈ చార్జీలను ఆన్‌లైన్లో పేర్కొని, ఆ మేరకు వసూలు చేస్తున్నా, చోద్యం చూడటం ప్రభుత్వ వంతవుతోంది. పండగ సమీపించే కొద్దీ ఇవి ౖపైపెకి చేరుతున్నాయి. ఓ కుటుంబం సొంతూరెళ్లి రావాలంటే సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతోందని పలువురు పేర్కొంటున్నారు.
శ్రద్ధ చూపని ఆర్టీసీ
రాష్ట్రంలో ఈ నెల 18 వరకు.. తెలంగాణలో ఈ నెల 16 వరకు సెలవులను ప్రకటించారు. కనుమ రోజున సొంతూళ్ల నుంచి ఎక్కువ మంది బయల్దేరరు. ఈ తరుణంలో ఆదివారం లేదా సోమవారం తిరుగు పయనమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు 120 ప్రైవేట్ బస్సుల వరకు నిత్యం తిరుగుతుంటాయి. అయితే పండగ వేళ హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు 28 బస్సులనే ఆర్టీసీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. ఈ పరిణామాల క్రమంలో ప్రైవేట్ బస్సులనే అధిక శాతం మంది ఆశ్రయించాల్సి వస్తోంది. టికెట్ల కోసం వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే ఓ ధర.. బుక్ చేద్దామనే ఉద్దేశంతో క్లిక్ చేస్తే మరో రేటును చూపిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
మినీ బైపాస్‌లో ప్రైవేట్ బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు క్యూ కడుతున్న ప్రజలు
నామమాత్రంగా ఆర్టీసీ బస్సులు
దోచేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
రెండు నుంచి మూడు రెట్ల మేర పెంపు
తిరిగెళ్లేందుకూ కష్టాలే
చోద్యం చూస్తున్న
రవాణా శాఖ అధికారులు
స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తాం
అధిక చార్జీలపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తాం, పండగకు ముందు రెండు రోజులు.. ఆ తర్వాత మూడు రోజుల పాటు తనిఖీలను చేపడతాం. జిల్లా పరిధిలోని మూడు టోల్ గేట్ల వద్ద ఎమ్వీఐలు, ఏఎమ్వీఐలకు విధులను అప్పగించి తనిఖీలు నిర్వహిస్తాం. ఆన్‌లైన్లో అధిక చార్జీలు పెట్టినా.. ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేసినా, విచారణ జరిపి బస్సులపై కేసులు నమోదు చేస్తాం. యాజమాన్యాలతో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించి మార్గదర్శకాలను జారీ చేశాం. – చందర్, డీటీసీ
సంక్రాంతి వచ్చింది.. తమ కుటుంబీకులతో పండగను ఆనందంగా జరు
సంక్రాంతి వచ్చింది.. తమ కుటుంబీకులతో పండగను ఆనందంగా జరు


