ఉత్సాహంగా క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రీడా పోటీలు

Jan 13 2026 5:54 AM | Updated on Jan 13 2026 5:54 AM

ఉత్సా

ఉత్సాహంగా క్రీడా పోటీలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో సంప్రదాయ క్రీడా పోటీలను జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. స్కిప్పింగ్‌, తొక్కుడు బిళ్ల, గాలిపటాలు, కర్రసాము, టగ్‌ ఆఫ్‌ వార్‌ క్రీడాంశాల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 350 మంది హాజరయ్యా రు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడా యాప్‌ ఆవశ్యకతను వివరించేలా రూపొందించిన గాలిపటం ఆకర్షణీయంగా నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.

డయల్‌ యువర్‌ ఎస్‌ఈకి

11 ఫిర్యాదులు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలో విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలనే లక్ష్యంతో నగరంలోని విద్యుత్‌ భవన్‌లో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సర్కిల్‌ పరిధి నుంచి 11 మంది తమ ఫిర్యాదులను ఎస్‌ఈ రాఘవేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈఈ బాలచంద్ర, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరుపతయ్య, నరసింహరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

కోడి పందేలు, జూదాలు

నిర్వహిస్తే చర్యలు

నెల్లూరు(క్రైమ్‌): సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా చేపడుతున్న చర్యలను నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఆమె వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశా మని తెలిపారు. జూదాలు నిర్వహంచినా, పాల్గొన్నా కేసులు తప్పవని చెప్పారు. కోడిపందేలకు వినియోగించే కత్తుల తయారీ, విక్రయాలు సాగించేవారిపైనా కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. పండగ సందర్భంగా ఊళ్లకెళ్లేవారు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రహదారి మార్గాలు, ముఖ్య కూడళ్ల వద్ద పోలీస్‌ పెట్రోలింగ్‌, బీట్‌ సిబ్బందితో ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డయల్‌ 112, స్థానిక పోలీస్‌ అధికారులకు సమాచారమందించాలని కోరారు.

ఐదేళ్ల చిన్నారిపై

లైంగిక దాడికి యత్నం

గూడూరు రూరల్‌: పట్టణంలోని అడవి కాలనీ ప్రాంతంలో బహిర్భూమికి సోమవారం వెళ్లిన ఐదేళ్ల చిన్నారిపై అదే ప్రాంతంలో ఉంటున్న తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల సదాశివం లైంగిక దాడికి యత్నించారని రెండో పట్టణ పోలీసులు తెలిపారు. చిన్నారి కేకలేయగా, వృద్ధుడ్ని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, తల్లి వివరాల మేరకు పోక్సో కేసును నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ గీతాకుమారి తెలిపారు.

శ్రీవారి దర్శనానికి

నాలుగు గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవా రం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నా రు. స్వామివారిని 76,447 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 21,708 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లను సమ ర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంట ల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

ఉత్సాహంగా క్రీడా పోటీలు 
1
1/2

ఉత్సాహంగా క్రీడా పోటీలు

ఉత్సాహంగా క్రీడా పోటీలు 
2
2/2

ఉత్సాహంగా క్రీడా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement