ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

Jan 12 2026 8:03 AM | Updated on Jan 12 2026 8:03 AM

ప్రజా

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
జిల్లాకు తీరని అన్యాయం
నిర్వీర్యం చేస్తూ.. బుకాయింపా..?

వైఎస్సార్సీపీ నేతల అడ్డగింత

సామాన్యులనూ

ఇబ్బందులకు గురిచేసిన వైనం

పొదలకూరు: రాయలసీమతో పాటు జిల్లా రైతాంగం.. ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే సీమ ఎత్తిపోతల పథక నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు డొల్లతనాన్ని బయటపెట్టేందుకు కండలేరు జలాశయ సందర్శనకు వెళ్తుంటే.. తమను టెర్రరిస్టుల మాదిరిగా పోలీసులు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కండలేరు జలాశయ సందర్శన నిమిత్తం పార్టీ నెల్లూరు రూరల్‌, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో కలిసి కాకాణి ఆదివారం బయల్దేరారు. ఈ క్రమంలో కండలేరు మెయిన్‌ రోడ్డు ఆర్చి వద్ద వీరిని పోలీసులు అడ్డుకొని, 25 మందికే అనుమతి ఉందని చెప్పారు. దీంతో ఖాకీల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా విలేకరులతో కాకాణి మాట్లాడారు. ప్రభుత్వ మెడలు వంచైనా జిల్లా సాగునీటి హక్కులను సాధించుకునేంత వరకు ఉద్యమాలను చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సోమశిల సందర్శన విషయంలోనూ పోలీసులు శనివారం ఇదే తరహాలో నిరంకుశంగా అడ్డుకున్నారని ఆరోపించారు. ఖాకీలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల వ్యవహారంలో చంద్రబాబు వైఖరి బయటపడిందని చెప్పారు.

భయంతోనే అడ్డుకుంటున్నారు..

జిల్లాలోని జలాశయాలను సందర్శిస్తే చంద్రబాబు చీకటి ఒప్పందాలు ప్రజల్లోకి వెళ్తాయనే భయంతో తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజలతో పాటు రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. నెల్లూరులో తాము బయల్దేరితే, నెల్లూరు, పొదలకూరు, డేగపూడి, కండలేరు ఇలా నాలుగు చోట్ల చెక్‌పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారని తెలిపారు. చివరికి చంద్రబాబు తన నీడను చూసినా భయపడుతున్నారని, తమ పార్టీ శ్రేణుల ఉద్యమబాటను చూసి వణికిపోతున్నారని చెప్పారు.

రేవంత్‌రెడ్డి చెప్పింది వాస్తవమా.. కాదా..?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది వాస్తవమా కాదాననే అంశాన్ని టీడీపీ నేతలు చెప్పాలని కాకాణి డిమాండ్‌ చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలపై స్పష్టతిచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబు అండ్‌ కంపెనీకి ఉందానని సవాల్‌ విసిరారు. సీమ ఎత్తిపోతల పథకం లేకపోతే ప్రధానంగా నష్టపోయేది నెల్లూరు జిల్లానేనన్నారు. శ్రీశైలం తర్వాత జిల్లాలో సోమశిల, కండలేరు పెద్ద జలాశయాలుగా ఉన్నాయని, జిల్లా కు ఇవి జీవనాడులని పేర్కొన్నారు. రాష్ట్రాల విభజనానంతరం ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుకై ్కన చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి వచ్చారని విమర్శించారు. తెలంగాణ అక్రమ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ప్రశ్నిస్తే, ఆయన్ను జైలుకు పంపుతారనే భయంతో మిన్నకుండిపోయారని ఆరోపించారు.

ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు

ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని కాకాణి ధ్వజమెత్తారు. పోలీసులు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. తామేమి చేస్తే కండలేరుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. హౌస్‌ అరెస్ట్‌లు, అడ్డుకోవడాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామాననే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. జిల్లాకు అన్యాయం జరిగితే ఉద్యమబాట పడుతూనే ఉంటామని హెచ్చరించారు.

అడుగడుగునా పోలీసుల మోహరింపు

పొదలకూరు: రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగ ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ఎండగట్టేందుకు కండలేరు జలాశయ సందర్శనకు వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై ఆంక్షలను పోలీసులు విధించారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంట వెళ్తున్న పార్టీ నేతలను పొదలకూరులో పోలీసులు నిలువరించి వెనక్కి పంపారు. సంగం రోడ్డు, రామనగర్‌ గేట్‌ సెంటర్లలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ తనిఖీ చేశారు. నెల్లూరులో కాకాణి బయల్దేరుతున్న సందర్భంగా చుట్టుపక్కల మండలాల నుంచి కండలేరుకు వెళ్లేందుకు వచ్చిన పార్టీ నేతలను గేట్‌ సెంటర్‌లోనే నిలిపేశారు. పండగల సందర్భంగా గ్రామాలకు వెళ్లే వారి కార్లను సైతం తనిఖీ చేయడంతో వారు ఇబ్బందులు పడ్డారు. కండలేరు వెళ్లేందుకు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నెల్లూరు రూరల్‌, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య పొదలకూరు చేరుకున్నారు. అయితే వారి వెనుక వస్తున్న వాహనాలను పోలీసులు నిలిపేశారు. దీంతో వెనక్కి వెళ్లిన కాకాణి.. ఖాకీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల కార్లను వదలాల్సిందిగా సూచించారు. తమ వాహనాలకు అనుమతి ఉందని పోలీసులకు వెల్లడించి కండలేరు వెళ్లారు. మార్గమధ్యలో డేగపూడి కూడలి వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి కారు నంబర్‌నూ నోట్‌ చేసుకొని పంపారు.

చిల్లకూరు: పుట్టిన గడ్డకే ద్రోహానికి పాల్పడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తూ.. బుకాయించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ విమర్శించారు. పట్టణంలోని సనత్‌నగర్‌లో గల పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన నాటి నుంచి అభద్రతా భావంలో చంద్రబాబు ఉన్నారని, అందుకే తమ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పోలీసులను వెంటనే రంగంలోకి దింపి అడ్డుకుంటున్నా రని మండిపడ్డారు. నెల్లూరులో హౌస్‌ అరెస్ట్‌లను శనివారం చేపట్టడం దుర్మార్గమన్నారు. ఖాకీలను అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.

బాబు మెడలు వంచైనా హక్కులను కాపాడుకుంటాం

జలాశయాలను సందర్శిస్తే మీకొచ్చిన నష్టమేమిటి..?

ప్రభుత్వ తీరు దుర్మార్గం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

2014 – 19 మధ్య ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో, కల్వకుర్తి సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని కాకాణి గుర్తుచేశారు. భీమ, నెట్టెంపాడు ఎత్తిపోతలను తీసుకొచ్చారని.. పాలమూరు, రంగారెడ్డి, డిండికి సంబంధించి శ్రీశైలం నుంచి 800 అడుగుల లోతు నుంచే రోజూ ఎనిమిది టీఎంసీల చొప్పున నీటిని తోడుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణను చంద్రబాబు అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 44 వేల క్యూసెక్కులకు దివంగత సీఎం వైఎస్సార్‌ పెంపొందించడంతో జిల్లాకు నీటిని తీసుకురాగలుగుతున్నారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటిమట్టం ఉంటేనే, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌కు నీరందుతుందని, అయితే 800 అడుగుల్లోనే పవర్‌ జనరేటర్‌కు నీటిని తెలంగాణ పెట్టుకుంటోందని తెలిపారు. ఈ తరుణంలో రాయలసీమ, నెల్లూరు రైతాంగ కష్టాలను తీర్చేందుకు సీమ ఎత్తిపోతల పథకాన్ని గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన అంశాన్ని ప్రస్తావించారు.

సీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను నిలిపేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేదిలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయక్త కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. కండలేరు ముఖద్వారం వద్ద బైఠాయించిన ఆయన మాట్లాడారు. చీకటి ఒప్పందాలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమశిల జలాశయాన్ని సందర్శించేందుకు శనివారం యత్నిస్తే, పోలీసులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క పిలుపిస్తే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు. సాగునీటి విషయంలో జిల్లాకు జరుగుతున్న అన్యాయం తమ ద్వారా బయటపడుతుందనే భయంతో పోలీసులను ప్రభుత్వం పెట్టి తమను అడ్డుకుంటోందని మండిపడ్డారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఉద్యమిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కండలేరు జలాశయ మెయిన్‌ రోడ్డు ఆర్చి వద్ద బైఠాయించిన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విధ్వంసాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయడంపై చంద్రబాబు మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు ఖండించడంలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఉద్యమం ద్వారా బహిర్గతమైందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను తాకట్టుపెడితే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 1
1/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 2
2/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 3
3/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 4
4/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 5
5/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 6
6/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 7
7/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం 8
8/8

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement