షిప్‌యార్డు నిర్మాణ పనుల పరిశీలన
వాకాడు: మండలంలోని తూపిలిపాళెం తీరంలో ఏర్పాటు చేయనున్న షిప్ యార్డు పనులను మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ ఆదివారం పరిశీలించారు. అవసరమైన భూములు, రోడ్డు, రైల్వే మార్గాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గూడూరు జంక్షన్ నుంచి తూపిలిపాళెం షిప్ యార్డు వరకు రైల్వే మార్గాన్ని ఏ విధంగా అనుసంధానం చేయాలనే అంశంపై ఆరాతీశారు. ఇది పూర్తయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది, రవాణా వ్యవస్థ మెరుగుపడి, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. తహసీల్దార్ ఇక్బాల్, ఆర్‌ఐ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల
పరిష్కార వేదిక నేడు
నెల్లూరు(దర్గామిట్ట): ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి.. వాటిని పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్ర మాన్ని సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.
ఓ వైపు చలి..
మరో వైపు వర్షం
నెల్లూరు(అర్బన్):అసలే చలికాలం.. దానికి తోడు తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మ హాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఆ ప్రభావం జిల్లా పై పడింది. చిరుజల్లుల మొదలుకొని ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీనికి చలిగాలులు తోడయ్యా యి. ఫలితంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయా యి. గరిష్టంగా 25.5.. కనిష్టంగా 19.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదివారం నమోదైంది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఆదివారం మధ్యాహ్నా నికి జిల్లాలో సరాసరిగా 4.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 4.30 నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నెల్లూరులో ఆకాశం మేఘావృతమై వర్షాలు పడటంతో నగరమంతా చిత్తడిగా మారింది. పాదచారులు, ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. బుజబుజనెల్లూరు మొదలుకొని వెంకటేశ్వరపురం, కొత్తూరు, పొదలకూరు రోడ్డు, మూలాపేట, ఎన్టీఆర్‌నగర్, నవా బుపేట ఇలా అన్ని చోట్ల వర్షం కురిసింది.
ఘనంగా వడ్డే ఓబన్న
జయంతి
నెల్లూరు(దర్గామిట్ట): స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఓబన్న జయంత్యుత్సవాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లెపు మునిస్వామి, బత్తల కృష్ణయ్య, నేతలు గుంజి సుధాకర్, ఉప్పు భాస్కర్, బాలాజీ, జనార్దన్, బూధాటి రాధయ్య, బెల్లంకొండ శ్రీనివాసులు, ఉదయగిరి నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదాన
పథకానికి విరాళం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1.89 లక్షల విరాళాన్ని ఆదివారం అందజేశారని ఏసీ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లాకు చెందిన కంకణాల రామకృష్ణయ్య జ్ఞాపకార్థం భార్య ఆదిలక్ష్మమ్మ, కుమారుడు పెంచలనరసింహం, సుబ్బరత్నమ్మ ఈ మొత్తాన్ని అందజేశారని ఆయన చె ప్పారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
షిప్‌యార్డు నిర్మాణ పనుల పరిశీలన
షిప్‌యార్డు నిర్మాణ పనుల పరిశీలన


