పదోన్నతులు కల్పించాలని డిమాండ్
నెల్లూరు(అర్బన్): వైద్య, ఆరోగ్య శాఖలో 30 సంవత్సరాలుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఫీమేల్)కు ప్రభుత్వం తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఏపీ హంస అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్‌రావు, కమల్‌కిరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. పలువురు ఏఎన్‌ఎంలు తమకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వంతో పోరాడాలని కోరుతూ నాయకులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు పదోన్నతులు లేకుండానే రిటైర్డ్ అవుతున్నారన్నారు. వైద్యశాఖలో వీరికన్నా వెనుక చేరిన ఉద్యోగులు ఒకటికి రెండు ప్రమోషన్లు పొంది ఏఎన్‌ంలపైనే సూపర్‌వైజర్లుగా అజమాయిషీ చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పందించి న్యాయం చేయాలన్నారు. అలాగే మెడికల్ ఆఫీసర్ల పదోన్నతులు, పీజీ చేసే వారికి ఇన్ సర్వీస్ రిజర్వేషన్లు తదితర విషయాలను కూడా పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కోశాధికారి శేషగిరిరావు, నాయకులు నాగరాజు, మజార్, సుకన్య, గౌస్‌బాషా, మంజరి, సుధాకర్‌రెడ్డి, మార్క్, లక్ష్మీకాంతమ్మ, ఉమా, విజయ, పద్మ, హైమావతి, రియానా తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ ఎస్‌ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని సోమవారం విద్యుత్ భవన్‌లో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రాఘవేంద్రం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య వినియోగదారులు 0861 – 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
పక్షుల కేంద్రంలో
సందర్శకుల సందడి
దొరవారిసత్రం: మండలంలోని నేలపట్టు పక్షుల కేంద్రంలో ఆదివారం సందర్శకుల సందడి నెలకొంది. పక్షుల పండగ సందర్భంగా రెండోరోజు వేలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విహంగాలను తిలకించారు. ఉదయం వర్షం కురవడంతో కేంద్రానికి విచ్చేసిన సందర్శకులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుంచి వాహనాల రద్దీ పెరగడంతో డీవీసత్రం నుంచి పక్షుల కేంద్రం ప్రధాన గేట్ల వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి, చైన్నె, నెల్లూరు, విజయవాడ, చిత్తూరు, కడప తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు అఽధిక మొత్తంలో విచ్చేసి విహంగాలను వీక్షించారు.
పదోన్నతులు కల్పించాలని డిమాండ్


