ఉత్తర కాలువలోకి దూసుకెళ్లిన కారు
● భార్యాభర్తలకు స్వల్ప గాయాలు
కలిగిరి: మండలంలోని కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం సమీపంలో హైవే పక్కన ఉన్న గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువలోకి ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. కావలి నుంచి కడప దర్గాకు షేక్ సుల్తాన్, ఆరిఫా దంపతులు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందారు.
మోటార్‌బైక్‌లు, ఆటోల సీజ్
కావలి(అల్లూరు): ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు కావలి రూరల్ పరిధిలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బుడమగుంట కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రతి ఇల్లు తనిఖీ చేశారు. సరైన పత్రాల్లేని 50 మోటార్‌బైక్‌లు, నాలుగు ఆటోలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు చేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.20
సన్నవి : రూ.10
పండ్లు : రూ.5
ఉత్తర కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఉత్తర కాలువలోకి దూసుకెళ్లిన కారు


