చందన, సీఎంఆర్‌లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): చందన, సీఎంఆర్ ఫెస్టివ్ వండర్స్‌లో భాగంగా ఆదివారం లక్కీ డ్రాను నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తీశారు. గిద్దలూరుకు చెందిన ఎం.గాయత్రి హీరో ప్లెషర్ స్కూటీ విజేతగా ప్రకటించారు. అలాగే డైలీ డ్రా తీయగా గ్రైండర్‌ను ఎం.అరినా (నెల్లూరు), ప్యాన్‌సెట్‌ను డి.నాగేంద్రబాబు, మిక్సీని సీహెచ్ బాలాజీ (కోవూరు), డిన్నర్‌సెట్‌ను వి.రాజగోపాల్ గెలుపొందారు. అలాగే మలేసియా ట్రిప్ విజేత బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పి.సురేష్ దంపతులకు టికెట్‌ను అందజేశారు. గత వారం స్కూటీ విజేత మోహన్‌రెడ్డికి కీని, అలాగే గ్రైండర్, పాన్‌సెట్, మిక్సీ, డిన్నర్‌సెట్లను గెలుపొందిన 35మందికి బహుమతులను గిరిధర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతికి వస్త్రాలు, బంగారు ఆభరణాలపై అనేక డిస్కౌంట్‌లు, ఆఫర్లు, వన్‌ప్లస్ వన్, వన్‌ప్లస్ టు, అలాగే ఒక చీర కొంటే రెండో చీర కేవలం రూ.1కే అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, సుబ్బన్న, శైలేష్, కిశోర్ పాల్గొన్నారు.


