కమనీయం.. నృసింహుని కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణం కమనీయంగా జరిగింది. ఉదయం అభిషేకాలు, సుప్రభాతం, పూలంగిసేవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను నిత్య కల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కల్యాణం గావించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిలో సహస్ర దీపాలంకరణ మండపంలోకి తీసుకొచ్చి అర్చకులు ఊంజల్‌సేవ చేశారు.
నిత్యాన్నదానానికి విరాళాలు
స్వామివారి నిత్యాన్నదాన పథకానికి ఇందుకూరుపేట మండలం గమళ్లపాళెం గ్రామానికి చెందిన తుళ్లూరు పెంచల నరసయ్య, రాజేశ్వరమ్మ దంపతులు రూ.51,381 నగదును అందించినట్లు దేవస్థానం ఏసీ శ్రీనివాసులు తెలిపారు. అలాగే ఆత్మకూరు మండలం నరసాపురానికి చెందిన కోటంరెడ్డి సుబ్బారెడ్డి, రాజేశ్వరి దంపతులు రూ.50 వేల నగదు అందించినట్లు చెప్పారు.
కమనీయం.. నృసింహుని కల్యాణం
కమనీయం.. నృసింహుని కల్యాణం


