కండలేరులో 61.350 టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 61.350 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,950 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ఇక్కడి నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,150, లోలెవల్ కాలువకు 100, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.
గుంతలను తప్పించబోయి..
సైదాపురం: మండల కేంద్రానికి సమీపంలోని కల్వర్టు వద్ద శనివారం సవక కర్రను తరలిస్తున్న లారీ గుంతలను తప్పించే క్రమంలో బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండో సంక్రాంతి పండగ వచ్చినా కూడా ఏ రోడ్డూ బాగుపడిన పరిస్థితులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
భగవతారాధనతో జీవితానికి సాఫల్యత
నెల్లూరు(బృందావనం): భగవంతుని ఆరాదించడం ద్వారా జీవితానికి సాఫల్యత కలుగుతుందని కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి మహాస్వామి అనుగ్రహభాషణ చేశారు. పప్పులవీధిలోని గురుదత్తాత్రేయ మఠంలో శనివారం జరిగిన వార్షికోత్సవానికి ఆయన విచ్చేశారు. తొలుత మఠం ప్రాంగణంలోని సౌభాగ్య సరస్వతి అమ్మవారిని, పరివార దేవతలకు పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి మంగళ శాసనాలను అందించారు. కలియుగంలో మనకు అవసరమైనది భక్తి యోగమన్నారు. పాప, పుణ్యాల ఫలితంగానే జన్మలు ప్రాప్తిస్తాయన్నారు. కార్యక్రమంలో కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన పండితులు, వైదిక రత్న మాచవోలు రమేష్‌శర్మ, గురుదత్తాత్రేయ మఠం మేనేజర్ మాచవోలు అనూరాధ, ప్రసాద్, కసవరాజు శ్రీధర్, కాకుటూరు శ్రీహరి, గ్రంధి లోకేష్‌బాబు, రాజాశ్రీనివాసరావు, చల్లగుండ్ల మోహన్‌రావు, గురురాజ, ఏడుకొండలు, పచ్చిపులుసు శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు.
కండలేరులో 61.350 టీఎంసీల నీరు


