పాస్‌ పుస్తకాల పంపిణీ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

పాస్‌ పుస్తకాల పంపిణీ వేగవంతం

Jan 11 2026 9:42 AM | Updated on Jan 11 2026 9:42 AM

పాస్‌ పుస్తకాల పంపిణీ వేగవంతం

పాస్‌ పుస్తకాల పంపిణీ వేగవంతం

కావలి(అల్లూరు): పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. చెన్నాయపాళెం ప్రాంతంలో కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియపై ఆరాతీశారు. రైతులకు ఎలాంటి అపోహలు, ఇబ్బందులు కలుగకుండా, చట్టప్రకారం అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాస్‌ పుస్తకాల పంపిణీతో పాటు ఈకేవైసీ పూర్తి కావడం కీలకమన్నారు. సమావేశంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement