బాబులో వణుకు | - | Sakshi
Sakshi News home page

బాబులో వణుకు

Jan 11 2026 7:08 AM | Updated on Jan 11 2026 7:08 AM

బాబుల

బాబులో వణుకు

● చంద్రబాబు పాపాలు.. రైతుల పాలిట శాపాలు

సాక్షి, ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగం, ప్రజల ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో చంద్రబాబు సర్కార్‌ మెడలు వంచేందుకు తాము ఎందాకై నా పోరాడతామని, కాల్చి చంపినా.. లాఠీచార్జీలు జరిపినా, అరెస్ట్‌లు చేసినా వెనక్కి తగ్గేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయడంతో సీమతో పాటు నెల్లూరుకు జరిగే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, సమన్వయకర్తలతో కలిసి సోమశిల జలాశయాన్ని శనివారం సందర్శించేందుకు ఆయన నిర్ణయించారు. అయితే ప్రాజెక్ట్‌ సందర్శనను అడ్డుకునేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని తమను హౌస్‌ అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ విలేకరులతో కాకాణి మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాటకం బయటపడిందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో అక్కడి సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో రాష్ట్ర రైతాంగానికి ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పారు. అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడారని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో శ్రీశైలం నుంచి నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 44 వేల క్యూసెక్కులను తీసుకునే అవకాశం ఏర్పడిందని వివరించారు. దీని ద్వారా సోమశిల ప్రాజెక్టుకు సాగునీరు సమృద్ధిగా అందిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నోటుకు ఓటు కేసులో చంద్రబాబు జుట్టు తెలంగాణ చేతిలో ఉండటంతో.. వారు చేసే దౌర్జన్యాలను ఆపే ధైర్యం ఆయనలో లోపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించిన నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. నెల్లూరు ప్రాంత సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం రోజూ మూడు టీఎంసీలను తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. దీనికి గానూ నిధులను కేటాయించి పనులను ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే వీటిని చంద్రబాబు అర్థాంతరంగా ఆపేసి.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అమ్ముడుబోయారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవమా కాదాననే అంశాన్ని ఆయన తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

పొంతని లేని మాటలు

చంద్రబాబుతో రహస్యంగా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయించానని అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన చంద్రబాబు, దానికి విరుద్ధంగా పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది రాయలసీమ నుంచి వచ్చిన వారేనన్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది దివంగత సీఎం వైఎస్సారేనని చెప్పారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడు కావడంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలంగాణలో 2014 – 19 మధ్య నిర్మించిన ప్రాజెక్టులతో పాటు కొన్నింటి సామర్థ్యాన్ని పెంచి 777 నుంచి 800 అడుగుల్లో రోజూ ఎనిమిది టీఎంసీలను వాడుకుంటోందని ఆరోపించారు. ఈ తరుణంలో మూడు టీఎంసీలను తీసుకొచ్చేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే, రహస్య ఒప్పందంతో దానికి చంద్రబాబు గండికొట్టారని మండిపడ్డారు. జిల్లాలో సోమశిల జలాశయంపై ఆధారపడి లక్షలాది మంది రైతులున్నారని తెలిపారు.

హౌస్‌ అరెస్ట్‌లు దారుణం

సోమశిల జలాశయ సందర్శనకు వెళ్తున్న తమను హౌస్‌ అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని చెప్పారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. భవిష్యత్తు భయంకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన దుర్మార్గాలు బయటకు రాకుండా ఉండాలనే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికై నా ఆయన తన స్వార్థ ప్రయోజనాలను విడనాడి.. రైతుల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఆయన మెడను వంచైనా జిల్లాకు రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని స్పష్టం చేశారు.

కోవూరు: ప్రజా సమస్యలపై గళమెత్తే ప్రతిపక్ష నేతలను చూసి సీఎం చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమశిల జలాశయ సందర్శనకు వెళ్లనీయకుండా ఆయన్ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుమ్మకై ్క రాష్ట్ర రైతుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు గానూ రేవంత్‌రెడ్డితో చంద్రబాబు లాలూచీ పడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలను ఆపేస్తున్నారని ఆరోపించారు. సోమశిల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. తామేమైనా పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులమా.. లేక సోమశిల డ్యామ్‌ను పేల్చేసేందుకు వెళ్తున్నామానని ప్రశ్నించారు. శాంతియుతంగా సందర్శించి, వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే తమ యత్నాన్ని అడ్డుకోవడం పిరికితనానికి పరాకాష్టగా అభివర్ణించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కాకముందే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా హౌస్‌ అరెస్ట్‌ వార్త తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయన నివాసం వద్దకు చేరుకొని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తన తప్పులు బయటపడతాయని ఆయనలో భయం

అందుకే హౌస్‌ అరెస్ట్‌లు

మెడలు వంచైనా సాగునీటి వాటాను సాధించుకుంటాం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

బాబులో వణుకు 1
1/5

బాబులో వణుకు

బాబులో వణుకు 2
2/5

బాబులో వణుకు

బాబులో వణుకు 3
3/5

బాబులో వణుకు

బాబులో వణుకు 4
4/5

బాబులో వణుకు

బాబులో వణుకు 5
5/5

బాబులో వణుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement