ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు
నెల్లూరు రూరల్: సోమశిల జలాశయ పరిశీలనకు వెళ్లనీయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులను మోహరించి.. నోటీసులను అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
నెల్లూరు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనకు నోటీసులను అందజేశారు.
ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు


