మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్‌ కారు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్‌ కారు

Jan 10 2026 9:30 AM | Updated on Jan 10 2026 9:30 AM

మార్క

మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్‌ కారు

నెల్లూరు(టౌన్‌): కాకుటూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కియా కారు షోరూంలో శుక్రవారం ఆల్‌ న్యూ కియా సెల్టోస్‌ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.జగన్నాథరెడ్డి మాట్లాడుతూ ఈ కారులో గ్లోబల్‌ కే3 – ఈ ప్లాట్‌ఫారం భారతదేశంలోనే మొదటిసారిగా ఈ సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కొత్త రకం ఎస్‌యూవీ కియా న్యూ సెల్టాస్‌ ప్రారంభ ధర రూ.10.99 లక్షలు ఉందన్నారు. ఈ కారు 8 రంగుల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. బుకింగ్‌ కోసం 86888 29718 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో షోరూం డైరెక్టర్లు నిరంజన్‌, భారతి, హోషిమారెడ్డి, ఆశిష్‌రెడ్డి పాల్గొన్నారు.

మహీంద్ర నూతన

కార్లు మార్కెట్లోకి విడుదల

నెల్లూరు(టౌన్‌): స్థానిక మహీంద్ర డీలర్‌ బాలాజీ ఏజెన్సీస్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో శుక్రవారం మహీంద్ర అండ్‌ మహీంద్ర కు చెందిన ఎక్స్‌ యూవీ 7 ఎక్స్‌ఓ, ఎక్స్‌ఈవీ 9ఎస్‌ కార్లను ఆర్డీఓ అనూష చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్‌ పార్టనర్‌ యడ్లపల్లి సంజయ్‌ మాట్లాడుతూ ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ కారు పెట్రోలు, డీజిల్‌ వెర్షన్‌లో 11 రకాల మోడళ్లలో లభ్యమవుతుందన్నారు. రూ.13.66 లక్షలు నుంచి అందుబాటులో ఉందన్నారు. అదే విధంగా ఎక్స్‌ఈవీ 9ఎస్‌ ఎలక్ట్రిక్‌ వాహనం 16 రకాల మోడళ్లలో లభిస్తుందన్నారు. దీని ధర రూ.19.95 లక్షల నుంచి అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు, షోరూమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చెరువుకట్ట ధ్వంసం

కోట: ఉత్తమ నె ల్లూరు చెరువుకట్ట ను ధ్వంసం చేసి మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరు తున్నారు. ఇటీవ ల కురిసిన వర్షాలకు చెరువు జలకళ సంతరించుకుంది. కట్టల పటిష్టత కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే చెరువుకట్టను కొందరు యంత్రాలతో కోతకు గురిచేసి మట్టిని తరలించారు. స్థానిక అధికార పార్టీ నాయకుడు రోడ్డు పనుల కోసం కట్టను తెగ్గొట్టి ఆ మట్టి తీసుకెళ్లినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్‌ ఏఈ మునిరత్నంను వివరణ కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్‌ కారు
1
1/2

మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్‌ కారు

మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్‌ కారు
2
2/2

మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్‌ కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement