బస్సు సీటు.. పెద్ద పరీక్షే..
ఆత్మకూరు బస్టాండ్‌లో ఎదురుచూస్తూ..
సంక్రాంతి పండగకు మరికొద్దిరోజులే ఉంది. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. దీంతో
హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు సొంతూర్లకు వెళ్లేందుకు శుక్రవారం నెల్లూరులోని ప్రధాన,
ఆత్మకూరు బస్టాండ్లకు క్యూ కట్టారు. అయితే బస్సులు తగినంత లేక, సకాలంలో రాక గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. వచ్చిన బస్సుల్ని ఎక్కేందుకు అష్టకష్టాలు పడ్డారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


