మండే స్వభావమున్న వస్తువులు తీసుకెళ్లొద్దు
● రైల్వే డీఎస్పీ మురళీధర్
నెల్లూరు(క్రైమ్): మండే స్వభావమున్న వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడం ప్రమాదకరం, నేరమని రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ ప్రయాణికులకు సూచించారు. ఇటీవల రైళ్లలో తర చూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బందితో కలిసి ప్రధాన రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. దీంతో పలువురు తమవద్దనున్న అగ్గిపెట్టెలు, సిగరెట్ లైటర్లు స్వచ్ఛందంగా బయటపడేశారు. అనంతరం రైళ్లతోపాటు ప్లాట్‌ఫారమ్‌లపై తనిఖీలు చేశారు. కార్యక్రమంలో రైల్వే ఎస్సై హరిచందన పాల్గొన్నారు.
గుడిసె దహనంపై పోలీసుల విచారణ
కోట: ఊనుగుంటపాళెం పంట పొలాల్లో పూడి గుడిసెను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు చెముడుగుంట వెంకటయ్య అనే రైతు ఎస్సై పవన్‌కుమార్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. గుడిసెలో ఉన్న విలువైన విద్యుత్ సామగ్రి, పైపులు, ఎరువులు పూర్తిగా మంటల్లో కాలిపోయినట్లు తెలిపాడు. రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందన్నాడు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


