ఆటోలు, మోటార్‌బైక్‌ల స్వాధీనం
పొదలకూరు: పట్టణంలోని విఘ్నేశ్వరపురం (ఎమ్మార్వో) కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి తనిఖీలు చేశారు. ఈ ప్రాంతంలో 15 వీధుల్లో జల్లెడ పట్టి పత్రాలు సక్రమంగా లేని రెండు ఆటోలు, 22 మోటార్‌బైక్‌లను స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పేకాట, కోడిపందేలు ఆడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీగా జరిమానాలు ఉంటాయన్నారు. డీఎస్పీ వెంట పొదలకూరు, పోర్టు సీఐలు ఎ.శివరామకృష్ణారెడ్డి, రవినాయక్, ఎస్సై హనీఫ్ తదితరులున్నారు.
పోలీసుల అదుపులో
అనుమానితులు
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని యర్రబల్లిపాళెంలో జరిగిన చోరీ కేసులో అనుమానితులుగా భావిస్తున్న జాతకం చెప్పే ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. వీరితోపాటు బంగారం పోగొట్టుకున్న బాధితులను కూడా విచారించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్సై వీరప్రతాప్ మాట్లాడుతూ అనుమానితులను విచారిస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.


