లారీ క్యాబిన్ దగ్ధం
నెల్లూరు(క్రైమ్): వైర్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీ క్యాబిన్ దగ్ధమైన ఘటన నెల్లూరు జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాజస్థాన్ నుంచి విద్యుత్ వైర్ లోడ్‌తో లారీ చైన్నెకి బయలుదేరింది. శుక్రవారం మెడికవర్ హాస్పిటల్ సమీప జాతీయ రహదారిపైకి వచ్చేసరికి లారీలోని వైర్లు షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన అటుగా వెళ్లేవారు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. సిబ్బంది సీహెచ్ నారాయణ, కిరణ్ తదితరులు ఫైర్ ఇంజిన్‌తో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. లారీ క్యాబిన్ దగ్ధమైంది.


