కెరీర్ గైడెన్స్ కోర్సు ప్రారంభం
వెంకటాచలం (పొదలకూరు): కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో టూరిజం మేనేజ్‌మెంట్ విభాగ ఆధ్వర్యంలో పీఎం – ఉషా నిధులతో నూతనంగా రూపొందించిన సర్టిఫికెట్ కోర్సు ఇన్ కౌన్సెలింగ్ అండ్ కెరీర్ గైడెన్స్‌ను గురువారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హజరైన వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడారు. పోటీ ప్రపంచంలో కేవలం విద్యాభ్యాసం మాత్రమే సరిపోదని, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని చెప్పారు. చంద్రమోహన్, పెరుగు రామకృష్ణ, ఉషశ్రీ, నరసింహారెడ్డి, విజయానంద్‌కుమార్‌బాబు, త్యాగరాజు, జవహర్‌బాబు, నీలామణికంఠ, సుజాత, రాజారామ్ పాల్గొన్నారు.


