గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ అజిత వేజెండ్ల
గూడూరు రూరల్: గంజాయి రవాణా, విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరించారు. గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఒకటో పట్టణ, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు ఉంటాయన్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఎస్పీ వెంట గూడూరు డీఎస్పీ గీతాకుమారి, సీఐలు శేఖర్‌బాబు, కిశోర్‌బాబు, శ్రీనివాస్, ఎస్సైలు మనోజ్‌కుమార్, శిరీష, సిబ్బంది ఉన్నారు.


