డైట్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
ఇందుకూరుపేట: మండలంలోని పల్లిపాడు డైట్ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రిన్సిపల్ వి.అక్కిరెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పండగ సంక్రాంతి అన్నారు. అన్ని మతాలకు చెందిన పండగలను విద్యాసంస్థలో నిర్వహించడం జరుగుతోందన్నారు. తద్వారా వాటి ప్రాముఖ్యత, సంస్కృతులను విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు భోగిమంటలు వేశారు. సామూహిక భోజనాలు చేశారు. పెద్ద పండగను ప్రతిబింబించే విధంగా పాటలు పాడారు. సాంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. రంగువల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైట్ సీనియర్ అధ్యాపకులు వి.రాధారాణి, ఎల్.నటరాజమూర్తి, జి.సుబ్బారావు, హైమావతి, ఖాజారసూల్, విజయచంద్ర, రఘుకుమార్, ఎస్.మాధవీలత, జి.నీరజ తదితరులు పాల్గొన్నారు.


