గూడూరులో చీలికలు దుర్మార్గం
చిల్లకూరు(గూడూరు): ఎంతో చరిత్ర కలిగిన గూడూరును ప్రస్తుత ప్రభు త్వం చీలికలు తెచ్చి మూడు మండలాలు నెల్లూరులో, రెండు మండలాలను తిరుపతిలో చేర్చడం దర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్‌నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అధికార పార్టీలోని కొందరి స్వార్థం కోసం గూడూరును రెండు ముక్కలు చేశారన్నారు. దగ్గరాజపట్నం ఓడరేవు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య అని, ప్రస్తుతం గూడూరు విభజన చేసిన తరువాత ఓడరేవు నిర్మాణం చేస్తామని హామీ ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. చరిత్ర కలిగిన గూడూరును ఒకటిగా ఉంచేలా వైఎస్సార్‌సీపీ కృషి చేస్తోందని, దీనికి ప్రతిఒక్కరి మద్దతు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రతిఒక్కరి సలహాలు, సూచనలు తీసు కుని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటామన్నారు.


