ఎనీటైమ్ మద్యం
జిల్లాలో మద్యం వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. నిబంధనలు తమకు పట్టవంటూ అందినంత మేరకు విక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించాలి. అయితే అనేక దుకాణాలు, బార్లలో నైట్‌సేల్స్‌తో పాటుగా తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగుతున్నాయి. దీంతో మందుబాబులు చెలరేగిపోతున్నారు. జిల్లాలోని కోవూరు నియోజకవర్గం పెద్ద పడుగుపాడు ప్రాంతంలో ఉదయం 8:30 గంటల సమయంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్దకు వచ్చిన వారికి అనధికారికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న వైనం సాక్షి కంటపడింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
ఎనీటైమ్ మద్యం


