పంటపాళెంలో కార్డన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

పంటపాళెంలో కార్డన్‌ సెర్చ్‌

Jan 8 2026 9:27 AM | Updated on Jan 8 2026 9:27 AM

పంటపా

పంటపాళెంలో కార్డన్‌ సెర్చ్‌

ముత్తుకూరు(పొదలకూరు) : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముత్తుకూరు మండలం పంటపాళెం ఊటల బలిజపాళెంలో పోలీసులు బుధవారం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని 25 బైక్‌లు, మూడు ఆటోలను సీజ్‌ చేసినట్టుగా ఎస్సై ప్రసాద్‌రెడ్డి తెలిపారు. కృష్ణపట్నం పోర్టు సర్కిల్‌ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

11 వాహనాల స్వాధీనం

రాపూరు: మండలంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి, సరైన పత్రాలు లేని 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు, గంజాయి, ప్రభుత్వ నిషేధిత పదార్థాలపై సీఐ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాపూరు, కండలేరు డ్యామ్‌, సైదాపురం, ఎస్సైలు వెంకటరాజేష్‌, రామకృష్ణ, క్రాంతికుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పంటపాళెంలో కార్డన్‌ సెర్చ్‌ 
1
1/1

పంటపాళెంలో కార్డన్‌ సెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement