గణతంత్ర దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
నెల్లూరు(దర్గామిట్ట): 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారు చేసి ప్రదర్శించాలన్నారు. పోలీస్, సాయుధ దళాలు, ఎన్‌సీసీ సంయుక్తంగా కవాతు ప్రదర్శనలివ్వాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఆర్వో విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ ఆర్.బాలాజీరావు, డీఆర్‌డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు నాగరాజకుమారి, గంగా భవాని, హేనాసుజన్, డీసీఓ గురప్ప, జిల్లా హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, ఐఅండ్‌పీఆర్ డీడీ వేణుగోపాల్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారి రమేష్ నాయక్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ అనూష పాల్గొన్నారు.


