జగన్‌ను కలిసిన నేదురుమల్లి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు.
రాజరాజేశ్వరి ఆలయ హుండీ కానుకల లెక్కింపు
నెల్లూరు(బృందావనం): నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీ కానుకలను లెక్కించారు. గతేడాది అక్టోబర్ నాలుగు నుంచి బుధవారం వరకు కానుకల రూపంలో రూ.26,71,781, అన్నదాన హుండీ ద్వారా రూ.1,10,482, ఒక యూఎస్ డాలర్‌ను భక్తులు సమర్పించారని ఈఓ కోవూరు జనార్దన్‌రెడ్డి తెలిపారు. ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష, వివిధ ఆలయాల ఈఓలు అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి, శ్రీధర్‌నాయుడు, దేవదాయ శాఖ నెల్లూరు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసబాబు, ప్రధానార్చకుడు రఘురామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 82,022 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 20,230 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
సంక్రాంతికి ఆర్టీసీ
ప్రత్యేక బస్సులు
నెల్లూరు సిటీ: సంక్రాంతిని పురస్కరించుకొని 28 ప్రత్యేక సర్వీసులను నడపనున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి షమీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి 18.. బెంగళూరు నుంచి 10 బస్సులను నడపనున్నామని వివరించారు. రిజర్వేషన్ సౌకర్యం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రామికులకు పనులు కల్పించండి
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి ఉపాధి హామీ శ్రామికులకు కల్పించాలని డ్వామా పీడీ గంగాభవానీ ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఈసీలతో బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గతంలో ఉపాధి పనులకు హాజరైన శ్రామికులకు పేమెంట్లు వారి ఖాతాల్లో జమవుతున్నాయని వెల్లడించారు. ఈ విషయమై అవగాహన కల్పించి పనులకు అధిక శాతం మంది హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గోకులాలు, పంటకుంటల లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలని కోరారు. నిబంధనల మేరకు పనులను కల్పించడంతో పాటు యాప్‌లో సక్రమంగా అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయాల్లో అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
జగన్‌ను కలిసిన నేదురుమల్లి
జగన్‌ను కలిసిన నేదురుమల్లి


