ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
కోవూరు: కోవూరు పోలీస్‌స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను ఎస్పీ అజిత వేజెండ్ల బుధవారం జారీ చేశారు. స్థానిక పీఎస్‌లోని వేణు, సునీల్ డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.
యూపీఎస్సీ ర్యాంకర్‌కు అభినందన
గూడూరు రూరల్: గూడూరు మండలం కందలికి చెందిన దర్శి సాగర్ యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీస్‌లో 66వ ర్యాంక్‌ను సాధించారు. ఈ తరుణంలో దర్శి సాగర్‌తో పాటు తల్లిదండ్రులు వెంకటకృష్ణయ్య, విజయమ్మను గ్రామస్తులు సత్కరించారు. బల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


