అంతని.. ఇంతని.. చివరికి పత్తాలేరు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఇరిగేషన్ శాఖలో తాను చెప్పిందే జరగాలని.. అంతా తానేనంటూ ఉన్నతాధికారులను సైతం గందరగోళానికి గురిచేసిన మేనేజర్ అడ్రస్ లేకుండాపోయారు. ‘ఫోన్‌పేలో లంచం... ఫైల్‌లో సంతకం’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఈ నెల రెండున ప్రచురితమైంది. ఇది వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆఫీస్‌లో సదరు అధికారి కుదురుగా ఉన్న సందర్భం లేకపోవడం గమనార్హం.
ప్రసన్నానికి పాకులాట
బుచ్చిరెడ్డిపాళెం సబ్ డివిజన్లో 31 వర్కులకు సంబంధించిన ప్రతిపాదనల ఆమోదంలో కాంట్రాక్టర్లకు మద్దతిస్తూ అర్హత లేని పనులకు సైతం అనుమతులివ్వాలంటూ ఇంజినీర్లతో మేనేజర్ గత నెల్లో గొడవపడ్డారు. ఈ తరుణంలో అక్రమాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా కథనం ప్రచురితం కావడంతో సదరు అధికారిలో దడ మొదలైంది. ఇంకేముంది అధికార పార్టీ నేతల కాళ్లు పట్టుకునేందుకు వారి ఇళ్లకెళ్తున్నారని ఆ శాఖ ఉద్యోగులే బహిరంగంగా పేర్కొంటున్నారు. సెలవు పెట్టకుండా నాలుగు రోజులుగా కనిపించని సదరు మేనేజర్‌పై నిజనిర్ధారణ చేయాల్సిందిగా విజయవాడ వర్క్స్ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్‌ను నియమించారు. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారని తెలు స్తోంది. కార్యాలయంలోని తన గది తాళాలను తీస్తున్నా, తలుపులను మాత్రం సిబ్బంది తెరవడంలేదు. కాగా డిప్యుటేషన్‌పై ఇన్ని రోజులు పనిచేసిన ఈయన్ను సొంత శాఖ వర్క్స్ అండ్ అకౌంట్స్‌కు సరెండర్ చేస్తారనే టాక్ నడుస్తోంది.


