మత్తు పదార్థాల జోలికెళ్లొద్దు
కోవూరు: యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని పోలీస్ అధికారులు తెలిపారు. జల్సాలకు అలవాటుపడిన కొందరు విశాఖపట్నం, ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు, కోవూరు ఇనమడుగు సెంటర్ ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు, ఉదయ్, జయదేవ్, సుబ్రహ్మణ్యం, ఎస్‌కే అక్బర్, శ్రీనాథ్ తదితరులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. వారి నుంచి మంగళవారం మధ్యాహ్నం రూ.3 లక్షల పైగా విలువచేసే ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి బజార్ సెంటర్ వరకు నడిపించారు. కార్యక్రమంలో సీఐ సుధాకర్‌రెడ్డి, కోవూరు ఎస్సై ముత్యాలరావు, ఏఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


