మట్టి వ్యాపారం.. కాసుల వర్షం
మట్టిని తరలించి చదును చేసిన ఏపీఐఐసీ
ఆధీనంలోని ప్రైవేట్ వ్యక్తుల భూమి
చిల్లకూరు: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి సంపదను అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు. గ్రావెల్, సిలికా, ఇసుక, క్వార్ట్ ్జను తవ్వి తరలించుకునేందుకు ముందుగా గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ, గనుల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న పోరెడ్డిగుంట కింద సుమారు 50 ఎకరాలు వరిని రైతులు సాగు చేశారు. డిసెంబర్‌లో వచ్చిన దిత్వా తుఫాను కారణంగా పోరెడ్డిగుంటకు గండి పడి నీరు మొత్తం దిగువకు ప్రవహించింది. దీంతో అది ఖాళీ అయ్యింది. రైతులు పంట సాగును పూర్తిగా నిలిపివేశారు. ఇదే అదునుగా భావించిన గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు గుంతల్లో ఉన్న మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏపీఐఐసీసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కొనుగోలు చేసిన వారికి ఐదురోజులుగా 10 టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నాడు. గండి పడిన పోరెడ్డిగుంటకు ఇరిగేషన్ అధికారుల అనుమతితో అక్కడే త వ్విన మట్టితో కట్టను ఏర్పాటు చేస్తే తెలుగుగంగ నీటిని గుంతకు తెప్పించికుని రైతులు వరి సాగు చేసుకునే వీలుంది. ఇలా చేస్తే తనకు ఏమి వస్తుందనుకున్న నాయకుడు ఏకంగా మట్టి తవ్వకాలు చేపట్టి దోచుకుంటున్నాడు. మట్టి తవ్వకాలమై ఇరిగేషన్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
పోరెడ్డిగుంటలో మట్టిని తవ్వుతున్న యంత్రాలు
మట్టి వ్యాపారం.. కాసుల వర్షం


