వైభవంగా ముగ్గురమ్మల తిరునాళ్ల
అల్లూరు: అల్లూరు గ్రామదేవతలైన పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగమ్మ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. దేశ, విదేశాల్లో స్థిరపడిన అల్లూరీయులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. కార్యనిర్వాహకుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 1001 కుండలతో అమ్మవారికి సద్ది నివేదన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. కాటంరెడ్డి నివాసం నుంచి ఆయన సతీమణి శివప్రియ ఆధ్వర్యంలో 1001 కుండలతో సద్దిని ఊరేగింపుగా పోలేరమ్మ గుడి వద్దకు తీసుకెళ్లారు. ప్రత్యేకాలంకరణలు, పొంగళ్లు, గ్రామోత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా ఉంచిన ముగ్గురమ్మవార్ల విగ్రహాలను చూసేందుకు భక్తులు తరలివచ్చారు.
అమ్మవార్ల విగ్రహాలు
పొంగళ్లు కార్యక్రమం నిర్వహిస్తున్న కాటంరెడ్డి దంపతులు
వైభవంగా ముగ్గురమ్మల తిరునాళ్ల


