కార్డన్ సెర్చ్‌లో వాహనాల స్వాధీనం
సంగం: మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలు, 40 మంది సిబ్బంది మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాల్లేని 56 బైక్‌లు, 8 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. సెర్చ్‌లో సంగం, ఆత్మకూరు సీఐలు శ్రీనివాసులురెడ్డి, గంగాధర్, సంగం, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం ఎస్సైలు రాజేష్, తిరుమలరావు, జిలానీ, సూర్యప్రకాష్‌రెడ్డి, సైదులు పాల్గొన్నారు.
● వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. సరైన పత్రాల్లేని 47 బైకులతోపాటు 3 ఆటోలను సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్సైలు వీరప్రతాప్, ఆల శ్రీను, మాల్యాద్రి, ఉమాశంకర్, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు.
సంగం : కార్డన్ సెర్చ్‌లో స్వాధీనం
చేసుకున్న వాహనాలు
వింజమూరు : సీజ్ చేసిన
వాహనాలతో పోలీసులు
కార్డన్ సెర్చ్‌లో వాహనాల స్వాధీనం


