ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్లోనూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అధికారం దక్కించుకున్న ప్రతీసారి ఎన్నిక ఏదైనా అరాచకమే ఆయుధంగా చేసుకుని అడ్డదారులు తొక్కడం టీడీపీకి పరిపాటిగా మారింది. గతంలో జెడ్పీ చైర్మన్‌తో పాటు నెల్లూరు కార్పొరే | - | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్లోనూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అధికారం దక్కించుకున్న ప్రతీసారి ఎన్నిక ఏదైనా అరాచకమే ఆయుధంగా చేసుకుని అడ్డదారులు తొక్కడం టీడీపీకి పరిపాటిగా మారింది. గతంలో జెడ్పీ చైర్మన్‌తో పాటు నెల్లూరు కార్పొరే

Jan 6 2026 7:15 AM | Updated on Jan 6 2026 7:15 AM

ప్రజా

ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఖాకీల సాక్షిగా ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం కుమిలి కుమిలి ఏడుస్తోంది. పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీకి పాదాక్రాంతం కావడంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగం ముందు భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోంది. ప్రజాదరణతో గెలవలేని టీడీపీ అడ్డదారుల్లో పదవులను తమ ఖాతాలో వేసుకునేందుకు అరాచకాలకు పాల్పడుతోంది. గతంలో ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ఎరవేసి సంతలో పశువులను కొన్నట్లుగా కొంటే.. ఇప్పుడు పోలీసుల ఎస్కార్ట్‌తో అరాచక శక్తులను ప్రోద్బలచి వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను కిడ్నాప్‌ చేయ డం, దౌర్జన్యం చేయడానికి తెగబడుతోంది. తాజా గా ఒక ఎంపీటీసీ సభ్యుడు కూడా లేని టీడీపీ వింజమూరు ఎంపీపీ పదవిని ౖకైవశం చేసుకునేందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం సాగించింది. ఒక వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని కిడ్నాప్‌ చేస్తే.. మరో మహిళా ఎంపీటీసీని సైతం ఎత్తుకెళ్లేందుకు బరితెగించారు. మాజీ ఎంపీపీని పోలీసుల ద్వారా అజ్ఞాతంలో నిర్బంధించగా, తాత్కాలిక ఎంపీపీని సైతం దాచేసి, ఆఖరి క్షణంలో తీసుకొచ్చి ఎంపీపీ పదవిని కొల్లగొట్టి.. టీడీపీ ముద్ర వేసుకున్నారు.

అరాచకమే ఆయుధంగా..

టీడీపీ అధికారంలో వచ్చాక అరాచకాలే ఆయుధంగా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో అడ్డదారుల్లో అందలమెక్కుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కనీస స్థానాలు కూడా లేని జెడ్పీ చైర్మన్‌, నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి.. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులను బెదిరించి కొందరిని, రూ.లక్షలు ఇచ్చి ప్రలోభ పెట్టి సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా.. టీడీపీకి పరాభవం దక్కగా, చివరకు వైఎస్సార్‌సీపీనే అధికార పీఠాలు దక్కించుకుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అదే పంథాలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు కొలువుదీరిన పీఠాలపై ఆ పార్టీ ముద్ర వేసుకునేందుకు అరాచకాలకు తెగించింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 కార్పొరేటర్ల స్థానాలు ఉండగా, వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక్కడ ఒక్క కార్పొరేటర్‌ స్థానం టీడీపీకి లేదు. అయినా అధికారంలోని టీడీపీ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మెడపై పోలీస్‌ కేసుల గన్‌ పెట్టి పచ్చ కండువాలు కప్పేసి.. టీడీపీ కార్పొరేటర్లంటూ చెప్పుకుంది. ఇదే సమయంలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరిగితే.. పచ్చ కండువా కప్పుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో టీడీపీ ముద్రతో ఆ పదవిని దక్కించుకుంది. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన రెండు డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక సమయంలో కూడా బలం లేని టీడీపీ రాత్రికి రాత్రే వైఎస్సార్‌సీపీ సభ్యులను డబ్బు సంచులతో కొనుగోలు చేసి విప్‌ భయంతో స్వతంత్ర అభ్యర్థిగా తమ ఖాతాలో వేసుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌సీపీ సభ్యులను రానివ్వకుండా విలువలకు పాతరేసి ఎన్నిక జరిపినట్లుగా చూపించి పేర్లు రాసుకున్నారు.. ఇలా ఏ ఎన్నిక జరిగినా సరే అడ్డదారులు తొక్కి తమ ఖాతాలో వేసుకుని తాత్కాలికంగా పైశాచికానందం పొందడం టీడీపీకే చెల్లింది. తాజాగా నెల్లూరు మేయర్‌ విషయంలోనూ టీడీపీ అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సామదాన దండోపాయాలు ప్రదర్శించారు. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు తిరిగి సొంత గూటికి చేరడంతో ఏకంగా పోలీసులతోనే వారిని కిడ్నాప్‌ చేయించి, చివరాఖరుకు టీడీపీ శిబిరానికి అప్పగించే విధంగా క్రూరంగా వ్యవహరించారు.

వింజమూరులో ప్రజాస్వామ్యం ఖూనీ..

వింజమూరు ఎంపీపీ ఎన్నిక వేళ పోలీసులు వ్యవహరించిన తీరుతో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ నేతృత్వంలో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని కిడ్నాప్‌ చేసి, మరో మహిళా ఎంపీటీసీపై దౌర్జన్యానికి తెగబడ్డారు. పోలీసుల సాక్షిగా అరాచకాలు జరుగుతున్నా.. కట్టడి చేయకపోగా, టీడీపీ గూండాలకు కొమ్ముకాశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి వింజమూరు మండలంలో టీడీపీకి ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేదు. అయినా ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ పెద్దలు ఖాకీలతోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారు. మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో 8 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలే. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒకరు జనసేన ఎంపీటీసీగా గెలిచిన వారే. టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానంలో కూడా గెలవలేకపోయింది. అప్పట్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఇనగలూరి మోహన్‌రెడ్డిని ఎంపీపీగా ఎంపిక చేసింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎంపీపీతోపాటు మరో ఇద్దరు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇద్దరి నేతల మధ్య ఆదిపత్య పోరు నేపథ్యంలో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టి దించేశారు. ఆ స్థానానికి జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన మహిళను ఎంపీపీగా ఎన్నుకునేందుకు అరాచకం సాగించి ప్రజాస్వామ్యానికి పాతరేశారు. ఇటీవల నెల్లూరు మేయర్‌ ఎన్నికల సమయంలో కూడా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ను పోలీసులు కిడ్నాప్‌ చేసి టీడీపీ క్యాంపులో వదిలి పెట్టిన సంగతి మరవక ముందే వింజమూరులో కూడా ఖాకీల సాక్షిగా టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేస్తున్నా చోద్యం చూసి వదిలేయడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది.

జిల్లాలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం

అధికారం మారగానే తమ ఖాతాలో వేసుకునేందుకు అడ్డదారులు

ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్‌ పదవులపై టీడీపీ ముద్ర

వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు

పచ్చ కండువాలు వేసి.. టీడీపీ బలంగా చెప్పుకోవడం పరిపాటి

పరాయి బిడ్డలకు తానే

తండ్రిననే రీతిలో టీడీపీ వ్యవహారం

తాజాగా వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో కిడ్నాప్‌లు, దాడులు

అధికారానికి కొమ్ము కాస్తున్న ఖాకీలు

ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్1
1/2

ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్

ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్2
2/2

ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement